ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం
తెలంగాణ బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం త్వరలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టంచనున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారి శాఖ మంత్రి వర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ గారు గురువారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు , బిసి కమీషన్ మెంబర్ కోతి కిషోర్ గౌడ్ గారు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లే లక్ష్మణ్ గౌడ్ మరియు గౌడ్ ప్రతినిధులతో కలసి ట్యాంక్ బండ్ పై పలు స్థలాలను పరిశీలించి ఒకటి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్యాంక్ బండ్ పై వివిధ స్థలాలను పరిశీలించి అనువైనదానిని ఎంపిక చేశాం. అతి త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తాం అని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. తెలంగాణ పర్యాటక అబివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Congratulation!