Please Wait...Gouds Information Portal Loading

Please Wait...Gouds Information Portal Loading

Welcome To Gouds Information Portal

Goud Jathiya Githam

గౌడ్ జాతీయ గీతం

నమస్తే ! నమస్తే ! భారత జననీ !
జయస్తే ! జయస్తే ! లోకపావనీ !

గంగా యమునా కృష్ణా గోదావరులు
పొంగారెడు సకల జాతి జీవన ఝరులు
ఆసేతు హిమాచల పర్యంతవాసులు
గీత పరిశ్రమ నొనర్చు కార్మిక జనులు
నీ సంతతి గౌడ వితతినేలు కల్పవల్లీ !
మా లోపల సమైక్యతను గూర్చుము తల్లీ ||న||

సత్యాహింసలును జ్ఙాన శాంతి ధర్మము
సంఘిభావము స్నేహము సౌబ్రాత్రమ్ము
నీతిని ఖ్యాతిని మాలో గలుగ జేయుమా
భేధవాద భేదమ్ములన్ గూల ద్రోయుమా ||న||

వర్ణాశ్రమ కులవృత్తిని నిలుపుము మాతా !
శ్రమజీవుల దరిజేర్చుము శాంతి దేవతా !
హింతాళ తాళ వనమ్ములు వృద్ధినొందగన్
హేమ రజిత రత్నాళీ సమృద్ధి సంపదన్. ||న||

జయ హిందను వజ్రశంఖ నినాదమ్ములు
ఏకగ్రీవమున బలుకు సుస్వరమ్ములు
జయ జవాన్ జయ కిసాన్ జయ గౌడ్ బలము
జయ కార్మిక వీరజనము లోకే భరత కులము.

నమో ! స్వతంత్ర జనని ! నీదు కీర్తి నిల్చుతన్
ప్రమోదమ్మున గౌడ కులము వృద్ధిగాంచుతన్.

నమస్తే ! నమస్తే ! భారత జననీ !
జయస్తే ! జయస్తే ! పునీత సుచరితా !

                     – మామిండ్ల రామా గౌడ్

( గౌడజన ప్రబోధము – అక్టోబర్ 1971, గౌడ శ్రీ గ్రంథమాల )