ఉప్పల్ లోని భగాయత్ లేఔట్ లో నూతనంగా నిర్మించనున్న గౌడ హాస్టల్ నూతన భావన నిర్మాణానికి చేయూతనందించాలని జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ చైర్మన్ డా. జడపల్లి నారాయణ గౌడ్ గారిని శనివారం గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు కోరగా కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయాలను అందిస్తున్నట్లు ప్రకటించి వెంటనే చెక్కు రూపంలో చేయూతనందించారు. గౌడ హాస్టల్ అభివృద్ధికి మేనేజింగ్ కమిటీ చేపడుతున్న చర్యలను నారాయణ గౌడ్ అభినందించారు. అడగగానే. స్పందించి చేయూతనందించినాడుకు డా. జడపల్లి నారాయణ గౌడ్ కు హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Congratulation!