Please Wait...Gouds Information Portal Loading

Please Wait...Gouds Information Portal Loading

Welcome To Gouds Information Portal

Our Team

Image Not Found

Our Team

Mamindla Bhaskar Goud
Managing Director

మామిండ్ల భాస్కర్ గౌడ్ అని నేను గౌడ్ జాతి మీద మక్కువ తో 2003 నుండి నిరంతరం గౌడ్ మిత్రులను, పెద్దలను కలవడం జరిగింది. అందుకు ముఖ్య కారణం మా నాన్నా కవి తెలుగు పండితుడు, తెలుగు సాహిత్యం లోనే ఎంతో పేరు సంపాదించినా కూడా గౌడ్ జాతి లో చాల తక్కువ మందికి తెలియడం చాల విచారకరం. 1970 లోనే పాపన్నపై సమగ్ర సమాచారం సేకరించి పద్యాలూ కూడా వ్రాసారు, అలాగే కవి గౌడప్ప, గౌడ్ ప్రభోదన పద్య కవితలు కూడా వ్రాసారు 1965 నుండి 1990 వరకు అల్ ఇండియా రేడియోలో పద్య కవితలు వచ్చేవి గౌడ్ జాతీయ గీతం కూడా వ్రాసారు, గౌడ్ జాతిలో పుట్టి తెలుగు సాహిత్యంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు, గీత వృత్తిదారుల కష్టాల గూర్చి పద్య రూపంలో చాల చక్కగా వ్రాసారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే గుర్తింపు వచ్చింది 9 వ తరగతి మరియు ఇంటర్ రెండవ సంవత్సరం తెలుగు పుస్తకాలలో పద్యాలూ పొందు పరిచారు అలాగే ప్రపంచ మహా సభల సమయంలో మా నాన్న పేరుతో తోరణం పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ లాంటి ఎందరో మహానుభావుల చరిత్ర మన గౌడ్ యువతరానికి అందించాలన్నదే మా సంకల్పం.
కానీ నేటి గౌడ్ యువతరానికి మన గౌడ్ పెద్దలు జాతి కోసం నిరంతరంగా పోరాడిన సరైన గుర్తింపు లేదు 2003 లో సర్ధార్ సర్వాయి పాపన్న పుస్తక రూపంలో రావడానికి ఎంతో కృషి చేసాము అలాగే అందులో గౌడ్ జాతీయ గీతం పొందుపరచడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న గౌడ్ లందరిని ఒకే గొడుకు క్రింద ఉంచాలనే లక్ష్యంతో 2007 లో goudsinfo అనే వెబ్ సైట్ పెట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం గౌడ్ మహనీయుల చరిత్ర అలాగే పట్టుదలతో వారు ఎంచు కున్న రంగం లో ఉన్నత స్థితి కి వెళ్లిన మన గౌడ్ జాతి ఆణిముత్యాలును ఒకే చోట పొందుపరిచి రేపటి తరానికి మార్గదర్శకులాయే విదంగా ఈ వెబ్ సైట్ కు రూపకల్పన చేసాము

Dirctor Rajani Goud Akula

Rajani Goud she is Running Goud matrimonial