నీరా తాగుతున్న మంత్రి వి. శ్రీనివాసగౌడ్ మరియు గౌడ్ ప్రతినిధులు
ముఖ్యమంత్రి కేసీర్ రాష్ట్రంలో గీత వృత్తిని ప్రోత్సహించటం కోసం నీరా పాలసీని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారనీ ఆబ్కారీ మంత్రి వి. శ్రీనివాసగౌడ్ తెలిపారు. మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ ఆధ్వర్యంలో కొంపల్లిలో జీలుగ చెట్ల నుంచి వచ్చిన నీరాను మంత్రి ప్రజలకు అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… జీలుగ చెట్టు నాటిన ఆరేళ్ళ తరువాత నీరాను అందిస్తుందన్నారు. గీత కార్మికులు విరివిగా తాటి, ఈత, జీలుగ చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. మేడ్చల్ జిల్లా ఎక్సయిజ్ సూపరింటెండెంట్ గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఈఎస్ అరుణ్ కుమార్, మరియు రాష్ట్ర గౌడసంఘ అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాలా నారాయణ గౌడ్ మరియు ఇతర గౌడ సంఘ నేతలు పాల్గొన్నారు.
Congratulation!