not found

వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.

బాల్యం, విద్యాభ్యాసం
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. వాణిశ్రీ నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ బి. వి. ఎస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి దాకా చదువుకున్నది. తర్వాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన మకాం మద్రాసుకు మార్చింది. వాణిశ్రీకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలని ఉండేది. లలిక కళలపై ఆసక్తి ఉండేది. మద్రాసుకు వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూ కొంతకాలం వీణ, నాట్యం నేర్చుకుంది. మెట్రిక్యులేషన్ తో చదువుకోవడం నిలిపివేసి మూడేళ్ళ పాటు భరతనాట్యం నేర్చుకున్నది. ముందుగా టి. ఆర్ మాలవ్య దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె తర్వాత వెంపటి చినసత్యం దగ్గర సుదీర్ఘకాలం పాటు నాట్యాన్ని అభ్యసించింది.

నటనా రంగం
నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాల్లో ప్రవేశించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్తకన్నీరు నాటకంలో కథానాయకుడి భార్యగానూ, చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో చిట్టెమ్మగా నటించి నాటక ప్రియుల అభిమానం పొందింది. చిట్టెమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హుణనూరు కృష్ణమూర్తి తన చిత్రం వీరసంకల్ప లో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆమెకు గౌరి ప్రొడక్షన్స్ అధినేత భావ నారాయణ, దర్శకుడు బి.విఠలాచార్య మూడు సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఎ. వి. ఎం సంస్థ వారు కూడా కాంట్రాక్టు పద్ధతి కింద రెండు సినిమాలకు కుదుర్చుకున్నారు. తెలుగులో ఆమె సంభాషణలు పలికిన మొట్టమొదటి చిత్రం బంగారు తిమ్మరాజు.

విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజామహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. కన్నడ, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించిన ఆమె తెలుగులో కథానాయికగా నటించడానికి ఓపికగా ఎదురు చూడవలసి వచ్చింది. అప్పటి దాకా ఆమె ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించింది. మరికొన్ని సినిమాల్లో రెండవ కథానాయికగా అవకాశాలు లభించాయి. ఒక వైపు తమిళ, కన్నడ అగ్రకథానాయకులైన ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు, బాలకృష్ణ లాంటి హాస్యనటుల సరసన సహాయ పాత్రల్లో నటించింది. ఎన్. టి. ఆర్ కథానాయకుడిగా నటించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో ఆమె సావిత్రిగా కనిపిస్తుంది. ఆమెకు నటిగా పేరు గడించిన తర్వాత సతీ సావిత్రి అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. అందులో యముడిగా ఎన్. టి. ఆర్ నటించాడు.

ఆమె హాస్య పాత్రలు పోషిస్తున్నప్పుడే బి. ఎన్. రెడ్డి ఆమెకు బంగారు పంజరం అనే చిత్రంలో కథానాయికగా అవకాశమిచ్చాడు. కానీ ఆ సినిమా కథను తయారు చేసుకోవడానికి బి. ఎన్. రెడ్డికి సుమారు మూడేళ్ళు పట్టింది. ఈ లోపుగా ఆమె ఇతర చిత్రాలలో కేవలం ఏడెనిమిది సన్నివేశాలున్నా ఆ పాత్రల్లో నటించింది. తమ సినిమాల్లో కథానాయికగా ఎన్నికైనా చిన్న వేషాలు ఎందుకు వేస్తున్నావంటూ బి. ఎన్. రెడ్డి ఆమెను మందలించాడు కూడా. సుఖ దుఃఖాలు చిత్రంలో ఆమె ధరించినది చిన్న పాత్రే అయినా బహుళ ప్రజాదరణ పొందిన ఇది మల్లెల వేళయనీ అనే పాటను ఆమె మీద చిత్రీకరించారు. మరపురాని కథ కథానాయికగా తెలుగులో ఆమె తొలిచిత్రం. ఇందులో ఆ సినిమాకు మాతృకయైన తమిళ సినిమాలో కథానాయిక పాత్ర పోషించిన సావిత్రి నటించాల్సి ఉండగా అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉండటంతో అధి సాధ్యపడలేదు. ఆ పాత్ర వాణిశ్రీని వరించింది. ఇందులో చంద్రమోహన్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా విజయవంతమై వాణిశ్రీకి మంచి పేరు తీసుకువచ్చింది.

మరపురాని కథ విజయవంతమైనా తర్వాత అవకాశాలు రావడానికి చాలాకాలం పట్టింది. తర్వాత ఆమె ఆత్మీయులు అనే చిత్రంలో నటించింది. ఇందులో అక్కినేని చెల్లెలిగా చేస్తావా, లేక హీరోయిన్ గా చేస్తావా అని నిర్మాతలు అడిగినప్పుడు పాత్ర విస్తృతి లేకపోయినా హీరోయిన్ గా చేయడానికే ఒప్పుకొంది. ఈ చిత్రం కూడా విజయవంతమైంది.

నాదీ ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినపుడు ఎస్. వి. రంగారావు ఈమెకు వాణిశ్రీ అనే పేరు పెట్టాడు.

Amenties

  • Movie

Video

not found