మామిండ్ల రామ గౌడ్, కవి
సహజ కవిగా గొప్ప గుర్తింపును అందుకున్న కవి మామిండ్ల రామ గౌడ్, మూర్తీ భావించిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న మాటను నిజం చేస్తూ చిన్నవయసులోనే బాల కవిగా మంచి గుర్తింపు పొందిన కవి మన రామగౌడ్. ఆ తరువాత ఘన సాహితి వేత్తల ప్రశంసలు అందుకోగల ఎత్తులకు ఎదిగిపోయారు. కవి కోకిల, సుకవి సుధాకర బిరుదులను అందుకున్నారు. పాఠ్యపుస్తకాల్లో ఆయన కవితలు చోటుచేసుకోవడం.. ఆయనకు ప్రతిభా ఘనతను మనకు చెప్పకనే చెపుతున్నది. వెనుక ముందు ఆయన్ని నడిపించేవారు ఎవరూ లేరు. అంతా స్వయం కృషే. అందుకే అయన జీవితం ఆదర్శ ప్రాయంగా నిలిచింది..
పుణ్యదంపతులు బాలమ్మ, మల్లాగౌడ్ కడుపు చల్లగా ఆయన 1943 జనవరి 14న లింగారెడ్డి పేట మెదక్ జిల్లాలో పుట్టారు. 18 నెలల పసి వయసులోనే కుటుంబ భారాన్ని తల్లి బాలమ్మకు వదిలి తండ్రి కాలం చేశాడు. ఆ తరువాత ఈ తల్లి బిడ్డలా మంచి చెడు చూసిన చిన్నాయన కూడా వీళ్ళను వదిలి పోయాడు. ఇక చెప్పేదేముంది చుట్టూ కడగళ్ళే.
Congratulation!