Please Wait...Gouds Information Portal Loading

Please Wait...Gouds Information Portal Loading

Welcome To Gouds Information Portal

కందాల రామయ్యకో ‘లెక్క’ఉంది…

కందాల రామయ్యకో ‘లెక్క’ఉంది…

మ్యాథ్స్​ లాబొరేటరీ ద్వారా లెక్కల్ని  సులువుగా నేర్పిస్తుండు

1998లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన కందాల రామయ్య ప్రస్తుతం ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం జిల్లా పరిషత్‌ పాఠశాల గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎమ్మెస్సీ, ఎంఈడీ చేశారు. నెట్‌ సాధించి ఉస్మా నియా యూనివర్సిటీలో మనోవిజ్ఞాన శాస్త్రంలో భావోద్వేగం, ప్రజ్ఞ, ఒత్తిడిని జయించడం, మూర్తిమత్వం అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనాపత్రాలు అంతర్జాతీయస్థాయి జర్నల్స్‌లో ప్రచురితమ య్యాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయిత. ఉపాధ్యాయుల కరదీపికలు, పిల్లలకు కృత్య రూపకల్పనలో దిట్ట. విద్యా పరిశోధన మండలి నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో గణిత ప్రయో­గశాల కృత్యాలను వినూత్నంగా రూపొందించి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

తండ్రి దూరమైనా తల్లి, ఇద్దరు అన్నల ప్రోత్సాహంతో  చదువులో రాణించాడు. లెక్కల మీద ఇష్టంతో మ్యాథ్స్​ టీచర్​ అవ్వాలనుకున్నాడు.  డిగ్రీ రెండో ఏడాది చదువుతూనే డీఎస్సీ రాసి టీచర్​ జాబ్ తెచ్చుకున్నాడు. లెక్కలంటే కష్టమైన సబ్జెక్ట్​ కాదని చెప్పడమే కాకుండా ఈజీగా  నేర్పించడం కోసం మ్యాథ్స్​ లాబొరేటరీ పెట్టాడు. పాఠాలు చెప్పడమే కాకుండా డోనర్స్ సాయంతో బడిలో పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు​ ఏర్పాటు చేశాడు. అతని సర్వీస్​కు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఏడాది  ‘నేషనల్​ టీచర్​ అవార్డు’ అందుకున్నాడు. మనరాష్ట్రం నుంచి ఈ అవార్డు అందుకున్న ముగ్గురిలో ఒకరైన ఆయన పేరు కందాల రామయ్య. ములుగు జిల్లా అబ్బాపూర్​ జెడ్పీ స్కూల్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడు.

అబ్బాపూర్​ గ్రామానికి చెందిన కందాల ప్రమీల,- రాజయ్య దంపతలకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరిలో రామయ్య చిన్నవాడు. తండ్రి కల్లు గీత కార్మికుడు. చాలీచాలని సంపాదనతోనే పిల్లల్ని చదివించారు. రామయ్యకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్​అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే లెక్కల టీచర్​ అవ్వాలనుకున్నాడు. వికారాబాద్​లో టీటీసీ (టీచర్​ ట్రైనింగ్ కోర్స్​) చేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకు రామయ్య తండ్రి చనిపోయాడు. దాంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అవేమి రామయ్యకు తెలియకుండా తల్లి, అన్నలు కష్టపడి అతడిని  చదివించారు. వాళ్ల కష్టం వృథాగా పోనివ్వొద్దు అనుకున్నాడు రామయ్య. డిగ్రీ చదువుతూనే 1998లో డీఎస్సీ రాసి, ఎస్​జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్​)గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. తర్వాత స్కూల్​ అసిస్టెంట్​ ప్రమోషన్​ రావడంతో ములుగు మండలంలోని కాశిందేవిపేట స్కూల్లో తొమ్మిదేండ్లు పనిచేశాడు.

పాఠ్యపుస్తకాల రచయితగా

జనగామ జిల్లా తాటికొండ జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న టైంలో  స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తుల నుంచి  డొనేషన్స్​ సేకరించి బెంచీలు ఏర్పాటు చేశాడు. ఈ ఏడాది ట్రాన్స్​ఫర్​ మీద సొంత ఊళ్లోని స్కూల్​కి వచ్చాడు. పిల్లలు మ్యాథ్స్​ని ఇష్టంగా నేర్చుకునేలా చేయడానికి మ్యాథ్స్​ లాబొరేటరీని ఏర్పాటు చేశాడు. స్టూడెంట్లతో మ్యాథ్స్​ ఎక్స్​పరిమెంట్స్ చేయించడమే కాకుండా వాళ్లను  జిల్లా, రాష్ట్ర స్థాయి  ‘సైన్స్​ ఫేర్’ పోటీలకు తీసుకెళ్లేవాడు.

మ్యాథ్స్​ లాబొరేటరీ ద్వారా లెక్కల్ని  సులువుగా నేర్పిస్తున్నందుకు  నేషనల్ ఎడ్యుకేషనల్​ కౌన్సిల్​  ఆయన్ని మెచ్చుకుంది కూడా. ఇతను నాలుగు, ఐదో క్లాస్​ మ్యాథ్స్​ పాఠ్యపుస్తకాల రచయిత కూడా. ‘లెర్నింగ్​ ఈజ్​​ మై లైఫ్’​ ​ అంటున్న రామయ్య  టీచర్​గా పనిచేస్తూనే ఎంఈడీ, ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. నెట్​, సెట్ ఎగ్జామ్​లో క్వాలిఫై అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీలో పీహెచ్​డీ  చేశాడు.

‘‘చిన్నప్పుడు మా ఊళ్లో బడికి టీచర్ గా వెళ్లడం మర్చిపోలేను. అప్పుడు 56 మంది పిల్లలే ఉన్నారు. దాంతో స్కూల్ లో సౌకర్యాలు పెంచడంతో పాటు ఎక్కువ మంది స్కూల్ కి వచ్చేలా చేయాలనుకున్నా. అంతేకాదు వాళ్లకు లెక్కల మీదున్న భయాన్ని పోగొట్టడానికి మ్యాథ్స్ లాబొరేటరీ ఏర్పాటు చేశా. ‘నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్’ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో మ్యాథ్స్ లో మరిన్ని ఎక్స్ పరిమెంట్స్ చేసేందుకు కావాల్సిన ఎంకరేజ్ మెంట్ లభించింది’’ అన్నాడు రామయ్య.