గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్
డిప్యూటీ మేయర్
కొత్త లక్ష్మీ రవి గౌడ్
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి గారు ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి నేడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్.
ఈ సందర్భంగా కొత్త లక్ష్మి రవి గౌడ్ మాట్లాడుతు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మనం పుట్టిన పుడమితల్లి ఋణం తీర్చుకునే అవకాశం కల్పించే మహోన్నతమైన కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నేను మరో ఆరుగురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేస్తూ మొక్కలు నాటాలని గౌరవ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, గౌరవ ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారికి, ప్రముఖ సింగర్ శ్రీ మనీషా గారికి, ప్రముఖ సింగర్ శ్రీ ధనుంజయ్ గారికి, టిఆర్ఎస్ మేడ్చల్ యువ నాయకులు కొత్త సాయి తేజ గౌడ్ గార్లకు పిలుపునిచ్చారు.
Post Views:
700
Congratulation!