గోపా హన్మకొండ జిల్లా కమటి ఆధ్వర్యంలో 2022 సం. లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో SSC, INTER లో ఉత్తీర్ణులైన గౌడ విద్యార్థులకు ప్రతిభా పుష్కరాలు అవార్డులు అందజేశారు, SSC లో అత్యుత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులకు, INTER IInd Yr. లో అత్యుత్తమ మార్కులు సాధించిన పదిమంది మొత్తం 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 5000/- (ఐదు వేల రూపాయలు) నగదుతో పాటు మెమంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర గోపా అధ్యక్షులు రమేష్ బాబు గారు ప్రధాన కార్యదర్శి బండి సాయన్న గారు అలాగే మాజీ గోపా అధ్యక్షులు డాక్టర్ విజయ భాస్కర్ గారు మరియు వరంగల్ గోపా కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిధిగా డా. నేరెళ్ల దామోదర్ NRI గారిని ఘనంగా సత్కరించారు.
Congratulation!