
సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ వ్వవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పలువురు ఏఐసీసీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహేశ్‌కుమార్ గౌడ్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. ర్యాలీ పెద్దఎత్తున వాహనాలు, గుర్రాలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో జరిగింది.
నా పదవితో నిరూపితం : ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం కార్యకర్తలకు గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయ
టంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నిరూపితమైందని వెల్లడించారు.
గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవటం తెలంగాణ రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేసీఆర్ సీఎం అయ్యాకే, తెలంగాణ రాజకీయాల్లో భాష మారిపోయిందని, కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకే రేవంత్‌రెడ్డి కూడా కాస్త గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పీసీసీ పదవితో నిరూపితమైందని వెల్లడించారు.
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు 1966 ఫిబ్రవరి 24న తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్ లో జన్మించి గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.
మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుడయ్యాడు.
బి. మహేష్ కుమార్ గౌడ్ 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.
ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి 2024 జనవరి 22న ప్రకటించాడు. ఆయన జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.
ఆయన పేరును తెలంగాణ శాసనమండలికి 2024 జనవరి 29న ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగా, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి 2024 జనవరి 22న ప్రకటించాడు.
ఆయన 2024 సెప్టెంబరు 6 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.
మహేష్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 2024 సెప్టెంబర్ 6న కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.
Congratulation!