not found

తమిళిసై సౌందరరాజన్

మిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టింది.

జననం
ఈమె 1961 జూన్ 2న కృష్ణ కుమారి, కుమార్ అనంతన్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించింది. ఈమె తండ్రి కుమారి అనంత‌న్ మాజీ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు.ఆమె వృత్తి రీత్యా వైద్యులు. ఆమె సోద‌రుడు వ‌సంత్‌కుమార్‌.

విద్యాభ్యాసం
ఈమె తన ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో అభ్యసించింది. సోనాలజీ, ఎఫ్.ఈ.టీ థెరపీలో ఉన్నత శిక్షణను కెనడా లో పూర్తిచేసింది.

వివాహం
తమిళసై, సౌందరరాజన్ ను వివాహమాడింది. ఆమె భర్త తమిళనాడులో వైద్యుడు, భారత వైద్య పరిశోధన మండలిలో పాలక మండలి సభ్యుడు.

రాజకీయ ప్రస్థానం
ఈమెకు చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. తన ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరింది. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007 లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013 లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. 2006, 2011 లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా, 2009, 2019 లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయింది.

Amenties

  • Nadar, Tamilnadu
not found