జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆమె 2019లో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
జననం, విద్యాభాస్యం
జోగి రమేష్ 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కృష్ణా జిల్లా , ఇబ్రహీంపట్నం లో జన్మించాడు. ఆయన విజయవాడలోని సర్దార్ గౌతు లచ్చన్న నేషనల్ కాలేజీ నుండి 1990లో బిఎస్సి పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
జోగి రమేష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి యూత్‌కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన కృష్ణాజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత వెంకట్రావు పై 1192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. జోగి రమేష్ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో జరిగిన ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో 7569 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆయన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశాడు.
తల్లిదండ్రులు : జోగి మోహనరావు, పుష్పవతి
జీవిత భాగస్వామి : శకుంతల దేవి
సంతానం : జోగి రాజీవ్, జోగి రోహిత్‌కుమార్, జోగి రేష్మాప్రియాంక
నివాసం : ఇబ్రహీంపట్నం
జోగి రమేష్ 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పై 7839 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
Amenties
- MLA
Congratulation!