not found

డా. బూర నరసయ్యగౌడ్  (మాజీ ఎం. పి. ) 

వ్యక్తిగత వివరాలు
జననం 1959 మార్చి 2 (వయస్సు: 60 సంవత్సరాలు)
సూర్యాపేట, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందు
బూర నరసయ్యగౌడ్ భారతీయ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నరసయ్య వృత్తిరిత్యా వైద్యుడు. లాప్రోస్కోపిక్, స్థూలకాయం, జీర్ణశయాంతర మొదలైనదానిలో వైద్యం చేశారు. నరసయ్య 20,000 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు.

జననం – విద్యాభ్యాసం
నరసయ్య తెలంగాణ లోని సూర్యాపేట జన్మించారు. అతను ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తిచేశారు.

వృత్తి జీవితం
ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాప్రోస్కోపిక్ సర్జరీ (HILLS) కి డైరెక్టర్ గా ఉన్నారు. అందేకాకుండా ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్ లలో వైద్య సేవలు అందిస్తున్నారు. బూర లక్ష్మయ్య, రాజమ్మ ఫౌండేషన్ ను స్థాపించి వ్యవస్థాపక చైర్మెన్ గా ఉంటూ పిల్లలు లేని జంటలకు ఉచిత లాప్రోస్కోపిక్ సేవలు అందిస్తున్నారు. తెలంగాణ లోని గ్రామ ప్రాంతాలలో లాప్రోస్కోపిక్ సర్జరీపై అవగాహన కల్పిస్తున్నారు.

రాజకీయ జీవితం
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. టిఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఫెల్లోషిప్స్
బూర నరసయ్యగౌడ్ వివిథ సంస్థలనుండి ఫెల్లోషిప్స్ పొందారు

ఫెల్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ సర్జన్స్ (ఎఫ్.ఎ.ఐ.ఎస్)
ఫెల్లో ఇంటర్ నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఎఫ్.ఎ.సి.ఎస్)
ఫెల్లో మినిమల్ ఆక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎమ్.ఎ.ఎస్)
పురస్కారాలు
1989 లో కేంద్ర ఆరోగ్య శాఖ నుండి ప్రత్యేక సర్జికల్ నైపుణ్యము అవార్డు
1990 లో ఉత్తమ సర్జన్ అవార్డు

Amenties

  • General Surgeon
not found