not found

ప్రిజం మల్టీమీడియా వ్యవస్థాపకుడు, శ్రీనివాస్ గౌడ్

పువ్వు పుట్టగానే పరిమిళిస్తున్న నానుడికి శ్రీనివాస్ మంచి ఉదాహరణ, ఖమ్మం జిల్లాలోని మారు మూలా గ్రామమైన తల్లంపాడు లో నీరు పేద వ్యవసాయ కుటుంభం లో 1974 లో జన్మించారు, చిన్ననాటి నుండే పట్టుదల సమయస్పూర్తి కలిగిన శ్రీనివాస్ విద్యార్ధి దశలోనే చాల చురుగా ఉండేవాడు ఉన్నత చదువులు కొరకు హైదరాబాద్ 1995 లో వచ్చాడు కానీ తన ఆర్థిక ఇబ్బందుల వలన ఉద్యోగం చేయాలనే తలంపుతో ఉన్న సమయంలో అప్పుడే కంప్యూటర్ రంగం లో మల్టీమీడియా రంగం మంచి భవిష్యత్ ఉందని మిత్రుల ద్వారా తెలుసుకొని అరేనా మల్టీమీడియా లో చేరాడు పట్టుదల అకుంఠిత దీక్ష వలన తొందరగానే మల్టీమీడియా రంగంలో నిష్ణాతుడు అయ్యాడు చేయు పట్టా రాగానే తన తోటి మిత్రులందరూ ఉద్యోగ అన్వేషణలో ఉంటె శ్రీనివాస్ మాత్రం తన నిరుపేద జీవితం గుర్తుకు వచ్చింది ఎలాగైనా తన లాంటి వాళ్లకు ఉజ్వల భవిష్యత్ అందించాలనే లక్యంతో తానే స్వయంగా ప్రిజం మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ ప్రారంచించాడు కానీ లక్షలలో వ్యవరం అయినా నిరుత్సహపడక అద్దె కంప్యూటర్లు పెట్టి వందల విద్త్యర్థులకు అతి తక్కువ ఫీజ్ పెట్టి వాళ్ళను తీర్చిదిద్దాడు.
తన జిల్లాలోని ఎందరో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిచాడు, కాచిగూడ నుండి అమీర్పేట్ కు తన ఇన్స్టిట్యూట్ కొత్త హంగులతో ఏర్పాటు చేశాడు, అప్పటి హోమ్ మినిస్టర్ శ్రీ దేవేందర్ గౌడ్ చేతుల మీదిగా అమీర్పేట్ బ్రాంచ్ ప్రారంభించాడు.
కొందరి పెద్దల సహాయంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కంప్యూటర్ హార్డ్వేర్, అనిమేషన్, మొబైల్ రిపేర్, 3D యానిమేషన్, వెబ్ డిజైన్ లాంటి శిక్షణ తరగతులు గత దశాబ్దంగా లక్షల నీరు పేదలకు సేవలు అందించాడు, ప్రిజం మల్టీమీడియా లో చేరి వందల సంఖ్యలో ఈ రోజు మలేసియా, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలలో అనేక మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు.
అంతే కాకుండా గౌడ్ జాతి కి తాను కూడా సేవ చేయాలనీ నిరంతరం తపన తో ఉంటాడు, నిరుపేద గౌడ్ విద్యారుతులకు శిక్షణనే కాకుండా అనేక కంపెనీ లలో లక్షల్లో జీతాలు తీసుకునే విధంగా తాను కృషిచేసాడు ఈ సక్సెస్ కు మరు పేరుగా నిలిచాడు. అలాగే గౌడ్స్ క్లబ్ వ్యవస్థాపక మెంబెర్ గా గత 6 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాడు, తన ద్వారా ఎందరో నిరుపేద విద్యార్థులు ఈ రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలలో పనిచేయడం తనకు ఎంతో సంతోషకరం అని చెపుతాడు

not found