మచ్చలేని లీడర్ దేవేందర్ గౌడ్
పార్టీలకు అతీతంగా వ్యవహరించిన వ్యక్తి : వెంకయ్య నాయుడు
హైదరాబాద్ దస్పల్లా హోటల్‌లో భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారిచే మా నాన్నగారు మాజీ ఎంపీ శ్రీ దేవేందర్ గౌడ్ గారి రాజ్యసభ ప్రసంగాలు, అంతరంగం, అసెంబ్లీ ప్రసంగాల సంకలనం పుస్తకావిష్కరణ.
నాయకుడిగా పదేళ్లు మంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి దేవేంద్ర గౌడ్ అని మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. దేవేందర్ గౌడ్ చట్టసభల్లో ఉందాతనాన్ని ఎప్పుడు కోల్పోలేదని, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి నిర్మాత్మక సూచనలు చేసేవారని వెంకయ్య కొనియాడారు. హైదరాబాదులోని దసపల్ల హోటల్లో బుధవారం దేవేంద్ర గౌడ్ తన రాజకీయ జీవితంపై రాసిన నాలుగు పుస్తకాలను వెంకయ్య నాయుడు, మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డి రిలీజ్ చేశారు. సందర్భంగా దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటి ప్రసంగాలు, చట్టసభల్లో మాట్లాడిన రికార్డింగ్లను పుస్తక రూపంలో తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పుస్తకాలు వ్రాయడానికి జర్నలిస్ట్ విక్రమ్ పూల సహకరించారని తెలిపారు, చట్టసభల్లో స్పీకర్లుగా వ్యవహరించడం ఆషామాషీ విషయం కాదని దానికి చాలా ఓపిక అవసరమని అది వెంకయ్య నాయుడు సురేష్ రెడ్డిలకు ఉందన్నారు,
వారి కాలంలో చట్టసభలను ప్రజాస్వామ్య బద్ధంగా నడపారని ప్రస్తుతం సభల్లో ఆ పరిస్థితులు లేవని అన్నారు. దేవేందర్ గౌడ్ ఒక జ్ఞాన సంపదని, ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో బయటకు తీసుకురావడం అభినందనీయమని వెంకయ్య నాయుడు అన్నారు. దేవేందర్ రాసిన పుస్తకాలు రేపటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు, విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందని దానికి చక్కటి ఉదాహరణ దేవేందర్ గౌడ్ అని వెంకయ్య కొనియాడారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఎప్పుడు అవసరం వచ్చిన రాజ్యసభలో తన గలాన్ని వినిపించేవారని గుర్తు చేశారు దేవేందర్ గౌడ్ రాజ్యాంగం ప్రజాస్వామ్యం పట్ల అమితమైన గౌరవం ఉన్న వ్యక్తి అని చట్టసభల్లో ఏనాడు ఆయన లక్ష్మణ రేఖను దాటలేదన్నారు రాజకీయాల్లో శత్రువులు ఉండరని ప్రత్యర్థులే ఉంటారని ఈ విషయాన్ని ఈ తరం రాజకీయ నాయకులు గుర్తించుకోవాలన్నారు.
Congratulation!