తెలంగాణ అమరవీరుని కుటుంబ సభ్యులకు సముచిత స్థానం, రూ. 10 లక్షల నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి.
నిజామాబాద్ పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన యువకుడు కె. సాయగౌడ్ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రానికి మద్దతుగా బలిదానం చేసుకున్నాడు. సాయగౌడ్ కు ఇద్దరు చెల్లెలు. అప్పటికే తల్లిదండ్రులు లేని వారికి స్వంత అన్న కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకోవడంతో అనాధలయ్యారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అక్కాచెల్లెల్లు ఇద్దరూ గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్న శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కలిసారు. దీనితో రూ. 10 లక్షల నగదును ప్రభుత్వం నుండి వారికి పోచారం గారు ఇప్పించారు. అక్క పెళ్లి అవ్వగా, చెల్లి ప్రసన్న లక్ష్మీ విద్యను కొనసాగిస్తుంది. తనకు ఉపాది క్రింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కోరింది.
మానవతా దృక్పథంతో పాటు, తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన సాయగౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచనతో పోచారం గారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు.
దీనితో ప్రసన్న లక్ష్మీ ని నిజామాబాద్ జిల్లా లో సహకార శాఖలో (DCO) జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
ఈరోజు హైదరాబాద్ లోని అధికారిక నివాసంలో స్పీకర్ గారిని కలిసి వారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ప్రసన్న లక్ష్మీ అందుకున్నది.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుని కుటుంబానికి తగు గౌరవం ఇచ్చి, వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నదని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు.
Post Views:
1,763
Congratulation!