ఈ రోజు అసెంబ్లీ లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధాన తెలిపిన రాష్ట్ర ఏక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ గారు
రాష్ట్రంలోని అన్ని కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. త్వరలోనే నీరా ఉత్పత్తిపై అధ్యయనానికి నిపుణుల కమిటీ కేరళ, మహారాష్ట్రతోపాటు శ్రీలంక, కాంబోడియా దేశాలకు వెళ్లనున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో గుడుంబా నిషేధంతో నష్టపోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు అంజయ్య, క్రాంతికిరణ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.
Congratulation!