ఈరోజు ఉప్పల్ నుండి తెలంగాణ గౌడ యువజన JAC ఆధ్వర్యంలో బొల్లారం గ్రామనికి బయలుదేరి వెళ్ళారు. ఆ గ్రామంలో గౌడ కులస్తులపై, మరియు ఆ గ్రామంలో కల్లు ను సర్పంచ్ నిర్ణయించిన రేటు మాత్రమే కల్లు తాగాలి. లేని యెడల కల్లు తాగిన వారికి చెప్పుదెబ్బలు, మరియు జరిమానా విధింస్తూ డప్పు చాటింపువేయడం జరిగింది. ఆ గ్రామ గౌడ కులస్తులకు మద్దతుగా ఆ గ్రామ సర్పంచ్ ను నిలదీయడానికి,మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక ఎక్సజ్ ఆఫీసు లో కంప్లైంట్ ఇవ్వడానికి, ఈ సంఘటనకు కారకులైన వారు, గౌడ సోదరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వెళ్ళడం జరిగింది. రాజు గౌడ్, నందు గౌడ్, మద్దెల హరీష్ గౌడ్, బాలగొని నవీన్ గౌడ్, పృద్వి గౌడ్, నాగేష్ గౌడ్ మొదలగువారు వెళ్ళడం జరిగింది.ఈ కార్యక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న సేన పూర్తి మద్దతును ప్రకటించింది. ట్రస్ట్ ఛైర్మన్ పంజాల జైహింద్ గౌడ్ గారు, మరియు నెర్థం భాస్కర్ గౌడ్ గారు,పంజాల శ్రావణ్ గౌడ్ గారు, గజ్జెల సత్యరాజ్ గౌడ్ గారు మాట్లాడుతూ గౌడకులస్తులు ఏ కులానికి గాని,వారి కుల వృత్తులకు గాని వ్యతిరేకం కాదు. మా కులానికి గాని, కులవృత్తులకు సంభందించిన విషయాలలో ఎవ్వరు జోక్యం సహించేదిలేదు. మా కల్లుకు ధర నిర్ణయం చేసే అధికారం మీకు ఎక్కడిది. ఖబడ్దార్ గౌడకుల వ్యతిరేకుల్లారా…వెంటనే గౌడ సోదరులుకు బేషరతుగా క్షమాపణలు చెప్పలని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.లేని యెడల గౌడ కులస్తులు సంఘటితమై తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని, హెచ్చరించారు.
పంజాల శ్రావణ్ గౌడ్ : cell 9949825336
Congratulation!