వి. శ్రీనివాస్ గౌడ్
ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖమంత్రి
వి.శ్రీనివాస్ గౌడ్ | |
---|---|
జననం | 1969 మార్చి 16 |
చదువు | బిఎస్సి , పిజిడిసిజె, పిజిడిడబ్ల్యూఎంఎం |
వృత్తి | రాజకీయ నాయకుడు |
విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014 మరియు 2018 లో ఎమ్మెల్యే గా గెలుపొందాడు. ప్రస్తుతం అయన ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ లో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖలకు మంత్రిగా ఉన్నాడు.
జననం
వి. శ్రీనివాస్ గౌడ్ 1969 మార్చి 16వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా, అడ్డాకల్ మండలం, రాచాల గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి నారాయణ గౌడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి వి.శాంతమ్మ గృహిణి. ఆయనకు ఒక చెల్లెలు శ్రీదేవి, తమ్ముడు శ్రీకాంత్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ కు 1991, మే 26వ తేదీన శారదతో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు కూతుర్లు శ్రీహిత మరియు శ్రీ హర్షిత.
వృత్తి జీవితం
అయన 1988 లో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. అతి తక్కువకాలంలో తన పనితనంతో ఉన్నతాధికారుల మన్నలను అందుకొని 1991 లో ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతిని పొందాడు. అనంతరం వికారాబాద్, అల్వాల్, కూకట్ పల్లి, కాప్రా మున్సిపాల్టీలలో కమిషనర్ గా పదవి బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా పని చేశాడు.
రాజకీయ జీవితం
Amenties
- Ministers
Congratulation!