టి.ప్రకాశ్ గౌడ్ శాసనసభ్యులు
పార్టీ : బిఆర్ఎస్ పార్టీ
ప్రాంతం : రాజేంద్రనగర్
వచ్చిన ఓట్లు : 1,19,647
మెజారిటీ : 31,844
తొలకంటి ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి 2023సార్వత్రిక ఎన్నికల్లో నాల్గవ సారి శాసన సభ్యుడిగా గెలిచారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు
ప్రకాష్ గౌడ్ 1959, మే 5న గండయ్య గౌడ్ – లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని మైలార్‌దేవపల్లి గ్రామంలో జన్మించాడు. పదవ తరగతి వరకు చదువుకున్నాడు.
ప్రకాష్ గౌడ్ గారికి సులోచనతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ విశేషాలు
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రకాశ్ గౌడ్, ఆ పార్టీలో నాయకుడిగా కీలకపాత్ర పోషించాడు. 2009లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, 2014లో జరిగిన 1వ తెలంగాణ శాసనసభకు తెలుగుదేశం పార్టీ పై రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పై రెండుసార్లు గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్ పై 25,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. మరోసారి 2023 శాసన సభ్యుడిగా గెలిచారు
Amenties
- MLA
- TRS Leaders
Congratulation!