not found

టి. పద్మారావు గౌడ్ శాసనసభ్యులు

తిగుళ్ళ పద్మారావు గౌడ్ (జ.ఏప్రిల్ 7, 1954) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, 2023 వరకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం కు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు గౌడ్, 2014 నుండి 2018 వరకుతెలంగాణ రాష్ట్ర తొలి ఎక్సైజ్, క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

జననం, విద్య

పద్మారావు గౌడ్ 1954, ఏప్రిల్ 7న ఈశ్వరయ్య – రాములమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్ లో జన్మించాడు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.

 

వివాహం – పిల్లలు

పద్మారావు గౌడ్ కి స్వరూప రాణితో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు (కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్), ఇద్దరు కుమార్తెలు (ఐశ్వర్య గౌడ్, మౌనిక గౌడ్) ఉన్నారు.

 

రాజకీయ జీవితం

పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కార్పొరేటర్‌గా గెలిచాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి లో 2001లో చేరి 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. పద్మారావు గౌడ్ 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో, 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్‌ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

2023లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు
2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2014 జూన్ 2 న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పద్మారావు గెలుపొందాడు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు

 

హోదాలు

2023లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు
2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2014 జూన్ 2 న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పద్మారావు గెలుపొందాడు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు

Amenties

  • MLA
  • TRS Leaders
not found