నారాయణ గురు
శ్రీ నారాయణ గురు
జననం 1856
చెంపళంతి, ట్రావెంకూర్, కేరళ
నిర్యాణము 1928 సెప్టెంబరు 20
వర్కాల, ట్రావెంకూర్
ప్రభావితులైన వారు
నారాయణ గురు (1856 – సెప్టెంబరు 20, 1928) కేరళకు చెందిన ఒక సంఘసంస్కర్త. సమాజంలోని మూఢ విశ్వాసాలను, కుల తత్వాన్ని నిరసించాడు. కులం కారణంగా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు అన్యాయానికి గురవుతున్నారనీ, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని ఆయన భావించాడు. వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైన సంస్థలు నెలకొల్పడానికి పాటు పడ్డాడు.
బాల్యం
1887లో ఆయన ప్రాచుర్యంలోకి వచ్చాక ఆయన బాల్య విశేషాల గురించి అనేక రకాలైన కథలు ప్రచారంలోకి వచ్చాయి కానీ అందులో వేటిలోనూ ఖచ్చితమైన సమాచారం లభించలేదు. నారాయణ గురు 1856లో కేరళ లోని తిరువనంతపురం సమీపంలోని చెంపళంతి అనే గ్రామంలో మదన్ ఆసన్, కుట్టియమ్మ అనే వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాడు. వయలవరంలోని వారి ఇల్లు ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయిలో ఉన్నది. ఆయనకు నారాయణన్ అనే పేరు పెట్టి నానూ అని పిలుచుకునే వారు. నానూ కు ముగ్గురు సోదరీ మణులు ఉండేవారు. తండ్రి మదన్ ఆసన్ ఉపాధ్యాయుడు. ఆయనకు సంస్కృతం, జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేదం లోనూ ప్రవేశం ఉంది. నారాయణన్ కు ఐదేళ్ళ వయసులో పక్కనే ఉన్న గురుకుల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు.
గుర్తింపు
రవీంద్రనాథ ఠాగూర్ నారాయణ గురు ను 1922 నవంబరున శివగిరి ఆశ్రమంలో కలిశాడు. తరువాత ఠాగూర్ ఆయన్ను గురించి నారాయణ గురును మించిన లేక ఆయనతో పోల్చదగిన ఆధ్యాత్మిక వేత్తను నేను ఎన్నడూ చూడలేద ని ప్రశంసించాడు.
Amenties
- Ezhava-Kerala
Congratulation!