not found

రవీంద్రసూరి నామాల తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, నటుడు మరియు సినిమా దర్శకుడు. 2015 లో “చెంబు చిన సత్యం (LIC Agent) సినిమాకి దర్శకత్వం వహించి, తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు
జననం
రవీంద్రసూరి 1973, సెప్టెంబర్ 24న చినసాయిలు, వెంకటమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం
ప్రాథమిక విద్యను చిల్పకుంట్లలో, నూతనకల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన రవీంద్రసూరి, మాధ్యమిక విద్యను సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బి.ఏ. (ఆంగ్ల సాహిత్యం) చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (తెలుగు), బి.సి.జె. అటుతరువాత తెలుగు విశ్వవిద్యాలయం లో జానపద కళల శాఖలో ఎం.ఫిల్ చదివాడు.

వివాహం
ఈయనకు రాణి ఐశ్వర్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (అక్షర్ పవన్, ఆద్య శ్రీ మహేష్)

రచనలు
రణన్నినాదం నా తెలంగాణ (పుస్తకం)
జానపద కళారూపాలు (ఆంధ్ర, తెలంగాణ అన్ని జానపద కళారూపాల ఆంధ్రభూమి మాస పత్రికలో ప్రచురణ)
నాకు నువ్వు నీకు నేను (ధారావాహిక)
200 కవితలు
25 కథలు
అనేక వ్యాసాలు
టీవీ రంగం
సి.ఐ.డి విశ్వనాథ్ (టీవీ5 ధారావాహిక) కు కథ, మాటలు అందించాడు
క్రిమినల్ స్టోరీస్ (ఎన్.టీవీ నేర కార్యక్రమం) 100 భాగాలకు రచయితగా చేశాడు
నువ్వొస్తావని (మాటీవీ ధారావాహిక) కు మాటలు అందించాడు
టేక్ ఇట్ ఈజీ (విస్సా టీవీ హాస్య కార్యక్రమం) కు కథ,[మాటలు అందించాడు
చలనచిత్ర రంగం
దర్శకుడిగా: చెంబు చిన సత్యం (ఎల్.ఐ.సి. ఏజెంట్)(రచన,దర్శకత్వం చేసారు)
రచయితగా: చెంబు చిన సత్యం (ఎల్.ఐ.సి. ఏజెంట్), జయహే (2010)
సంభాషణలు: మై నేమ్ ఈజ్ అమృత” (2010), తొలిపాట
నటుడిగా
జయహే (చలన చిత్రం),
సిక్త్ సెన్స్ (లఘు చిత్రం),
నువ్వొస్తావని (ధారావాహిక) లలో నటించాడు.
అవార్డులు – పురస్కారాలు
తొలి ఉత్తమ దర్శకుడు (కలర్స్ అవార్డు)
తేజ కళా పురస్కారం-2015

Amenties

  • Cine Artist
  • Poet
  • Writer
not found