పొన్నం ప్రభాకర్ శాసనసభ్యులు
పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, ప్రస్తుత శాసనసభ్యులుగా హుస్నాబాద్ నుండి గెలిచారు భారత జాతీయ కాంగ్రెస్ తరపున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి 2009-14 మధ్య 15వ లోకసభకు పార్లమెంటు సభ్యుడు ప్రాతినిథ్యం వహించాడు.[2] కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడిన ఎం.పి.లలో పొన్నం ప్రభాకరే చిన్న వయస్కుడు.[3] తెలంగాణలోని నాయకులలో ఒకరిగా ఉన్న పొన్నం ప్రభాకర్ విద్యార్థి ఉద్యమకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పొన్నం ప్రభాకర్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[4] పొన్నం ప్రభాకర్ 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్‌గా 2023 ఆగస్ట్ 30న నియమితుడయ్యాడు.[5]
పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు 2009 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో హుస్నాబాద్ అభ్యర్థిగా ప్రకటించింది
ప్రభాకర్ గారు 1967, మే 8న సత్తయ్య – మల్లమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.
ప్రభాకర్ గౌడ్ గారికి కి 2000, ఏప్రిల్ 21న మంజుల గారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్)
రాజకీయ ప్రస్థానం
1987-1988 మధ్యకాలంలో ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ డిగ్రీ, పీజీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నుండి, ఒక విద్యార్థి నాయకుడుగా, యూనియన్ అధ్యక్షుడుగా పనిచేశాడు.
1987-1989 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించాడు.
1987-1988 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా కళాశాలల కన్వీనర్ గా పనిచేశాడు.
1989-1991 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర కార్యదర్శి పదవిని, 1992-1998 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టాడు.
1999-2002 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
2002-2003 మధ్యకాలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
2002-2004 మధ్యకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ సమన్వయకర్తగా పనిచేశాడు.
2004-2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా పనిచేసారు.
2009లో లోక్ సభకు పోటీచేసే వరకు డి.సి.ఎం.ఎస్. అధ్యక్షుడుగా, మార్కుఫెడ్ విదేశాంగ ఛైర్మన్ గా చేశాడు.
భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2009 లో 15వ లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఎం.పి.గా ఎన్నికయ్యాడు.
2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం.(2019 సార్వత్రిక ఎన్నికల రాజీనామా చేశాడు)
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిలో పొన్నం ప్రభాకర్ ఒకరు.
2023 సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి శాసనసభ్యునిగా గెలిచారు
నిర్వర్తించిన పదవులు
తెలంగాణ ప్రాంతం నుండి 15వ లోక్‌సభలో అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు.
రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు.
రసాయనాలు, ఎరువులు, కంప్యూటర్లపై జాతీయ కమిటీల సభ్యుడు.
ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్.
Amenties
- Ministers
- MLA
Congratulation!