కె.పి. వివేకానంద గౌడ్ శాసనసభ్యులు
పార్టీ : బిఆర్ఎస్ పార్టీ
ప్రాంతం : కుబ్ధుల్లాపూర్
వచ్చిన ఓట్లు : 1,87,999
మెజారిటీ : 85,575
కె.పి. వివేకానంద గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు
వివేకానండ గౌడ్ 1977, అక్టోబర్ 21 న కెఎం పాండు, శ్యామల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలంలోని కుతుబుల్లాపూర్ లో జన్మించాడు. తండ్రి పాండు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశాడు. కుత్బుల్లాపూర్ మునిసిపాలిటీకి మొదటి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. చింతల్ సమీపంలోని హెచ్ఎంటి ఉన్నత పాఠశాలలో 1994లో తన పాఠశాల విద్యను పూర్తిచేసిన వివేకానంద, 1996లో హైదరాబాదు పంజాగుట్టలోని చాణక్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ముఫాఖమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల నుండి 2001లో తన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు
వివేకానండ గౌడ్ కు సౌజన్యతో వివాహం జరిగింది. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ విశేషాలు
వివేకానంద గౌడ్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత శక్తి యువ సేవా సమితిని ప్రారంభించిన వివేకానంద 2000 సంవత్సరంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టిడిపి నుంచి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ చేతిలో ఓడిపోయాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కె. హనుమంత్ రెడ్డిపై 39,021 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.వివేకానంద గౌడ్ 10 ఫిబ్రవరి 2016న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై 41,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు
తెలంగాణ రాష్ట్ర 2023 సార్వత్రిక ఎన్నికల్లో కుబ్ధుల్లాపూర్ నుండి శాసనసభ్యులు గా భారీ మెజారిటీ తో గెలుపొందారు
యుఎస్‌లో జరిగిన యుఎస్ యంగ్ లీడర్స్ పొలిటికల్ ప్రోగ్రామ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఐదుగురిలో తెలంగాణ రాష్ట్రం నుండి వివేకానంద ఒకరు మాత్రమే.
హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.
2014లో పుణె భారతీయ ఛత్ర సంసద్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చేతులమీదుగా 2014 సంవత్సరానికి ఆదర్శ్ యువ విద్యార్థి పురస్కారం అందుకున్నాడు.
Amenties
- MLA
- TRS Leaders
Congratulation!