వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలో తెలంగాణ గౌడ సంఘం వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పూజారి రఘు గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొనగాని యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా మంది యువత చదువుకొని మన వృత్తి పై ఆధారపడి జీవనం కొనసాగిస్తు తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నరని రూ 2000 కోట్లతో గౌడ ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా యువతను ఆదుకోవాలని , తాడి చెట్టు పై నుంచి పడిన గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్ గ్రేషియా లో మెడికల్ బోర్డు నిబంధనలను పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న మెడికల్ బోర్డ్ ను వెంటనే ఎత్తి వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నీరా ప్రాజెక్ట్ పై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించి గీతకార్మికులకు అండగా నిలవాలని కోరారు. గ్రామ గౌడ సంఘం యూత్ అధ్యక్షుడిని సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జనగాం వెంకటేశ్వర గౌడ్, జిల్లా కార్యదర్శి సట్ల నరేష్ గౌడ్ , న్యాయ వాది విక్రమ్ గౌడ్, గ్రామ ప్రెసిడెంట్ చెంగల సౌరజ్యం గౌడ్ , వైస్ ప్రెసిడెంట్ చెంగల శ్రీను గౌడ్ , బండారి శ్రీను గౌడ్ , బుర్ర వెంకటరమణ గౌడ్ , సురేష్ గౌడ్ , వెంకన్న గౌడ్ , ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Congratulation!